ఇవాళ వాతావరణం చాలా ఆహ్లాదంగా వుంది. చిన్న చిన్న ఆనందాలని మిస్ చేసుకోకూడదనిపించింది. వెంటనే మా ఫ్రెండ్ కి ఫోన్ చేసి మరీ బుర్ర తిన్నాను. ఇంటరు ఇద్దరం ఒకే కాలేజీలో చదివేవాళ్ళం. తను నాకన్నా ఒక ఏడాది సీనియర్. చిన్నప్పటి నుంచి స్నేహితులం. సన్నగా జల్లు పడుతూంటే ఇద్దరం సైకిల్ ఎక్కి నాలుగు మైళ్ల దూరాన వున్నా సముద్రం రోడ్ వైపు వెళ్ళేవాళ్ళం. అటూ ఇటూ పచ్చటి పొలాలు. మధ్యన ఆగి వాటిని చేతులతో తాకి సినిమాల్లో లాగా పరిగెత్తి నవ్వుకునేవాళ్ళం. మళ్ళీ సైకిల్ ఎక్కి బ్రిడ్జీ దాక వెళ్లి అక్కడ కిందకు దిగి ఆగివున్న పడవలో ఎక్కి కూర్చుని, వెంట తెచ్చుకున్న మొక్కజొన్న కండలను తిని ప్రేమించు పెళ్ళాడు సినిమా లోని 'వయ్యారి గోదారమ్మ' పాటని బాగా పెద్దగా పాడుకుని ఆనందించేవాళ్ళం. బ్యాక్ గ్రౌండ్ సోలో ని కూడా మేమే పాడేసుకునేవాళ్ళం. ఈలోపల వాన పెద్దది అవుతుందని సముద్రం దాకా వెళ్ళకుండా ఇంటికి తిరిగి వచ్చేవాళ్ళం. ఒక్కనాడూ ఇద్దరం సైకిల్ మీద సముద్రానికి వెళ్ళనే లేదు.
ఇవన్నీ దానికి వర్ణించి మరీ గుర్తు చేసాను. అసలే గొంతు నెప్పితో బాధపడుతోంది. ఇంకేమి అనలేక నా సోదంతా విని గుంటూరు ఎప్పుడు వస్తావు బాపట్ల వెళదాము అన్నది. నువ్వు సైకిల్ మీద ఎక్కించుకుని తోక్కుతానంటే వస్తానని అన్నాను సరదాగా. మా అయన నాకు విడాకులు ఇస్తారేమో అన్నది. పర్లేదు, వదిలి అన్నా. అంతే, నాకు ఇవాళ తిక్క బాగా వచ్చిందని రేపు మాట్లాడదాం ఆఫీసు లో నీకు పని ఎక్కువైనట్టు వున్నదని పెట్టేసింది.
నాకేమో మళ్ళీ మళ్ళీ అవే సంగతులు గుర్తుకొస్తున్నాయి. మాట్లాడదామంటే మా వాడు నిద్ర పోయాడు. ఆయన వూరికి వెళ్ళారు. ఇలా బ్లాగు మీద పడ్డాను.
ఇనాటి చినుకులకీ ఆనాటి చినుకులకీ ఎంత తేడా?

3 వ్యాఖ్యలు:
బాగుందండి మీ సైకిల్ యాత్ర:-)
thanks
బావుంది. ఐతే మీరూ బాపట్లన్న మాట. ఇప్పుడే మురళిగారి మిరపకాయబజ్జీ టపాలో మీ వ్యాఖ్య చూసి ఇటొచ్చా. నాకు సొంతూరు కాదులేండి కానీ ఒక యేడు ఇంజనీరింగు కాలేజిలో పాఠం చెప్పాను. ఎప్పుడన్నా వీలైతే నా బ్లాగులో బాపట్ల అని వెతికితే అప్పటి ముచ్చట్లు కొన్ని వస్తాయి.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి