మనసు మనసు అంటాం కానీ ఇంతకీ మనసంటే ఏంటి. బుద్ధి వద్దని చెబుతున్నా వినకుండా గంతులేసేదే మనసేమో.
వూహ తెలిసినప్పటినుంచీ ఈ మనసుగోల మొదలుతుంది. వానలో ఆడాలని మనసుపడతాం, కానీ ఆంక్షలు. స్నేహితులతో గంటలతరబడి కబుర్లు చెప్పాలని మనసు పడతాం, కానీ చదివే సమయం తగ్గుతుందని ఆంక్షలు.
చిన్నతనంలో ఇవన్నీ మామూలే. కానీ పెద్ద అయ్యాక కూడా ఈ ఆంక్షలు మనకు తప్పవు అనే పరిస్థితి ఏర్పడుతోంది.
పెళ్లి అవ్వగానే భాగస్వామి ఆంక్షలు, ఆడవారికైనా సరే, మగవారికైనా సరే. పిల్లలు పుట్టగానే వారికోసం మన మనసుకు విధించుకునే ఆంక్షలు. ఇహ మెల్లిగా మనకు మనసు ఉన్నదీ అన్న సంగతే మర్చిపోతాము. మన భాద్యత, మన కర్తవ్యమ్ అనుకుంటూ సర్ది చెప్పేసుకుని జీవితాన్ని వెళ్ళదీస్తూ ఉంటాము.
ఎప్పుడో ఉన్నట్టుండి గట్టిగా కేకలేస్తూ ఆ మనసు మనలోనే ఇంకా ఉన్నానంటూ గోల చేస్తుంది.
అది ఎ సందర్భము అయినా కావచ్చు దాని లెఖ వుండదు. ఇంతకాలం నుంచి నన్ను అనగదొక్కేసావా అంటూ అల్లరి చేస్తుంది. కాకపొతే జీవితం యాంత్రికంగా మారిన తరువాత అప్పుడప్పుడూ నేను ఇంకా నీలోనే వున్నాని గుర్తు చేసే ఈ మనసు ఎంతో సున్నితం.
అది స్పందించడానికి ఒక గొప్ప సందర్భమే అఖరలేదు. ఉన్నట్టుండి పావురాలన్నీ ఎగుర్తూ వుంటే ఉలిక్కిపడి వెనక్కి జరిగి చప్పట్లు కొట్టే చిన్నారిని చూడగానే మనసు ఎంత ఆనందపడుతుందని.
వానలో తడిసిన చిన్నారి అమ్మ ఎక్కడ కొడుతుందో అనుకుంటూ ఇంటికి వస్తే ఏమీ అనకుండా నవ్వేసి దగ్గర చేర్చుకుంటే ఆ కళ్ళలోన్ని ఆనందాన్ని ఆస్వాదించకుండా ఈ మనసు ఊరుకుంటుందా?
ఎందుకో ఇవాళ చిన్ని చిన్ని సంఘటనలే నా మనసుకు సంతోషానిచ్చాయి. ఇంకా ఎంతో రాయాలని వున్నా నాకు నేను పెట్టుకున్న ఆంక్షల వల్ల మనసుకి గుడ్ బై చెప్పక తప్పడం లేదు.

1 వ్యాఖ్యలు:
ఎప్పుడో ఉన్నట్టుండి గట్టిగా కేకలేస్తూ ఆ మనసు మనలోనే ఇంకా ఉన్నానంటూ గోల చేస్తుంది. బాగుందండీ! నేను కూడా ఈ మనసు గురించి నా ఉద్దేశ్యం ప్రకారం వేరే కోణములో వ్రాయడం జరిగింది మీకు సమయం చిక్కినప్పుడు చూడండి!
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి