ఆదివారం 27 నవంబర్ 2011

మా కలయిక... ఇరవై సంవత్సరాల తరువాత....

మొన్నా మధ్యన లత  మెయిల్ చేసింది హైదరాబాద్ వస్తున్నాను పదిహేను రోజులు ఉంటున్నాను మనవాళ్ళు ఎవరైనా కలిసారా అని. ఇంతకీ లత ఎవరంటే నా స్నేహితురాలు. నాతోపాటు డిగ్రీ చదివింది. అమెరికా లో సెటిల్ అయ్యింది. ఇండియా వచ్చి ఈ మధ్యన నాలుగేళ్ళు అయ్యింది. మా డిగ్రీ పూర్తి అయ్యి ఇరవై ఏళ్ళు అయ్యాయి. అప్పుడే ఇన్ని ఏళ్ళు గిర్రున తిరిగాయా అనిపిస్తుంది. సరే నేను కుమారిని మటుకే కలుస్తున్నాను, ఇంకెవరూ టచ్ లో లేరు, ప్రయత్నిస్తాను అని చెప్పాను.
ఆరోజు రాత్రి  కూర్చుని నెట్లో వెదకడం మొదలుపెట్టాను. మా వీణ పేస్ బుక్ లో కనిపించింది. పిచ్చ సంతోషం. తన స్కూల్ ఫోటో పెట్టబట్టి గుర్తుపట్టా గలిగాను.తన ద్వారా జయ నెంబరు తెలిసింది. జయ ద్వారా సువర్ణ , కళ్యాణి వివరాలు తెలిసాయి. అలాగే ఇంకో రాత్రి కూర్చుని నా పుస్తక సామ్రాజ్యాన్ని శోదించాను. పద్మ నెంబరు దొరికింది. కానీ ఇప్పుడు వాళ్ళు అక్కడ లేరు. కష్టపడి సెల్ నెంబరు సంపాదించాను. పద్మ ద్వారా వెంకటు, సతీషు ఆచూకీ దొరికింది. నా పుస్తకాల లోనే కవిత నెంబరు అనుకోకుండా భలేగా కనిపించేసింది. ఇంకేముంది.. ఇక అందరం కలవడమే తరువాయి.

ఒక్కొక్కరికి ఫోన్ చేసి మాట్లాడేసరికి తెగ ఆశ్చర్యం ఆనందం. నేను ఈ సారి ఎలాగైనా అందరం లత కోసమైనా కలుద్దామని మిగిలిన వాళ్ళ ఆచూకీ తెలుస్తుందేమో కనుక్కోమని చెప్పాను. మిగిలిన అందరూ వేరే దేశాల లోనే వున్నారు. అందరం నవంబరు ఇదున కలవాలని అనుకున్నాము. ఇక ఆ క్షణం కోసం ఎదురు చూడటమే సరిపోయింది. నేను నాలుగు రోజులముందే మా వాడికి  సెలవలు  ఇవ్వడంతో  హైదరాబాద్ చేరాను. కళ్యాణి వైజాగ్ నుండి వస్తానండి. ఇంకొకరు బెంగళూరు నుంచి. మొత్తానికి ఆ రోజు రానే వచ్చింది. నేను ముందుగా లతని పిక్ అప్ చేసుకున్నాను. నన్ను చూడగానే ఏంటే నువ్వు లావు అవ్వదమా అని ఆశ్చర్యపోయింది. ఇంకా సన్న బద్దానులే అని చెప్పాను. ఈ కాస్త తేడాకే నన్ను లావు అయ్యావని అన్నది. ఇంకా నిజంగా అయ్యానా కింద పడిపోతుంది.
ఇద్దరం కలిసి నెక్లస్ రోడ్ లోని ఈట్ స్ట్రీట్ కి బయలు దేరాము. బయట మా బాగులు చెక్ చేస్తున్నారు. లత తెచ్చిన చాకలేట్లను లోపలి తీసుకు వెళ్ల నివ్వమని ఆపేశారు. వాళ్ళతో గొడవ పడుతున్న మాకు వీపు మీద రెండు దెబ్బలు పడ్డాయి. కవిత మీ ఇద్దరి వీపులు పగలకోట్టేసింది. ఇన్ని ఏళ్ళు అయినా తనకీ అలవాటు పోలేదు.

ముగ్గురం కలిసి లోపల కూర్చున్నాము. మాలో పెద్ద మార్పులు  లేవు. పెద్ద వాళ్ళం అయ్యామనే భావన తప్ప. ఈలోగా కవిత అదిగో సువర్ణ వచ్చింది అన్నది. నేను అస్సలు గుర్తుపట్ట లేదు దగ్గరగా వచ్చాక కానీ. తన ఆరేళ్ళ చిన్న కూతురిని తీసుకుని వచ్చింది. పెద్ద అమ్మాయి తరువాత లేటుగా పుట్టిందని సిగ్గుపడింది. చాలా మారిపోయింది. కుమారి ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే పెద్ద టెన్షను లో వున్నాను వస్తానో లేదో అన్నది. నాకు అస్సలు బాగా అనిపించలా. ఎలాగైనా రావలిసిందే అని చెప్పాను. ఈలోగా వీణ, వెంటనే కల్యాణి వచ్చారు. ఇద్దరూ ఒకటే గోల. మా కల్యాణి అప్పటిలాగే శ్రధగా అలంకరించుకుని వచ్చింది. వీణా గల గలా అలాగే మాట్లాడుతోంది. ఇక కవిత, లత, సువర్ణ కబుర్లు ఆగడం లేదు. నేను మటుకు అందరినీ ఆనందం గా చూస్తూ ఫొటోస్ తీసుకుంటున్నాను. అందరూ ఒక్క సారిగా అరిచారు. జయ వచ్చింది. తనూ చాలా మారిపోయింది. చాలా నిదానంగా వుండేది. పిచ్చ పోష్ గా వచ్చింది. అందరూ కెవ్వు కెవ్వున కేకలే. ఈలోగా పద్మ, వెంకట్ చేరారు. కుమారి వస్తున్నాను అని మెసేజ్ పంపించింది.
కాసేపటికి కుమారి కూడా వచ్చింది. అందరం ఏదో డిగ్రీ లో సెలవలు అయ్యి కలిసినట్టుగా ఉన్నాము కానీ మేము కలిసి ఇరయై ఏళ్ళు అయినట్టు అనిపించలేదు.
అందరికీ సొంత వ్యక్తిత్వాలు ఏర్పడ్డాయి, అభిప్రాయాలు అభిరుచులూ మారివుంటాయి. జీవితం లోని సుఖదుఖాలని చూసి వుంటారు. కానీ స్నేహం ఎంత అద్భుతమైనది. స్నేహితుల మధ్యన మాటలు ఆ చనువు అలాగే ఇన్ని సంవత్సరాల తరువాత కూడా మారలేదు. అలాగే నాలుగు గంటలు గడిచిపోయాయి. ఇంకా తనివితీరా మాట్లాడుకోవాలని వుంది. కాని వెళ్ళక తప్పదు.
ఒకరి కష్ట సుఖాలు ఒకరం చెప్పుకున్నాము. సువర్ణ  తన ఇబ్బందుల గురించి అనగానే కల్యాణి తన చెల్లెలి ద్వారా తనకో మార్గం చూపింది. మాకందరికీ సంతోషం అనిపించింది. తనకు మేమున్నాము అనే భరోసా ఇచ్చాము. సతీషు, శ్రీనివాస్ ఫోనులో మాట్లాడారు. మిస్ అయ్యినందుకు ఫీల్ అయ్యారు. అందరం మాట్లాడాము.
ఇంతకీ నాకో క్రెడిటు దక్కింది. అందరూ నా వల్లనే కలిసామని నాకు ఇంకా అభినందనలు చెపుతూనే వున్నారు. నేను చాలా సార్లు ప్రయత్నించి విసిగి పోయాను. ఏమో మరి మేము అందరం ఇలా ఇరవై ఏళ్ళు గడిచిన   తరువాత కలవాలని రాసి పెట్టినట్టు వున్నది.

అందరం సంతోషం నిండిన మనసుతో, వెళ్ళక తప్పదన్న బాధతో  ఇక మీదట కనీసం ఏడాదికి వొకసారి అయినా కలవాలని నిశ్చయించు కున్నాము. ఒక్కొక్కరమూ వీడ్కోలు తీసుకున్నాము. ఇదిగో అందరికీ ఫోన్లు చేస్తూ ఫొటోస్ ని అప్లోడ్ చేస్తూ ఇలా ఈరోజు కి కూర్చుని నా జ్ఞాపకాలని నెమరు వేసుకునే తీరుబడి చిక్కింది.

16 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

hmmmmmm chinna naati aa gnapaakalu gurutu chesukuntune entho anandam..meeru antha kalusukunnaru ..chaala santosham..

రసజ్ఞ చెప్పారు...

బాగుందండీ! ఎన్ని పనులలో ఉన్నా ఎంత దూరంలో ఉన్నా ఇలా అందరినీ అప్పుడప్పుడు కలవడం నిజంగా ఒక గొప్ప అనుభూతే! మీరిలానే ప్రతీ ఏడాదీ కలుస్తూ మీ అనుభవాలను పంచుకుంటూ ఉండాలని కోరుకుంటూ.........

చిన్ని ఆశ చెప్పారు...

బావుందండీ, అన్నేళ్ళ తరువాత స్నేహితులని కలవటం ఆ జ్ఞాపకాలను కలసి నెమరు వేసుకోవటం ఓ తియ్యని అనుభూతి...

లత చెప్పారు...

బావుందండి,సంవత్సరాల తరువత ఇలా కలవడం గొప్ప అనుభూతి

తొలకరి చెప్పారు...

Thank u all

వనజ వనమాలి చెప్పారు...

baagundandee! chaalaa santhosham. prayatnam antoo undaale gaani annee manaki anduthoone untaayi. snehameraa..jeevitam. snehaaniki Jai.. Digvijayeebhava..

raafsun చెప్పారు...

ENTA BAAGAA ENJOY CHESARO KADU???

SARVEYJANA SUKHINO BHAVANTU...ANDARU ELLAPPUDU BAGUNDAALI..

RAAFSUN

తొలకరి చెప్పారు...

@raafun &vanajavanamali
Thanks.ఎంత మాట్లాడుకున్నా నిజంగానే తనివితీరలేదు. ఇంకా ఇప్పటికీ ఆ రోజు గడిపిన క్షణాలే గుర్తుకొస్తున్నాయి.

సిరిసిరిమువ్వ చెప్పారు...

బాగుంది.

మేము కూడా 25 సంవత్సరాల తర్వాత జనవరి 1 న కలవాలని ప్లాన్ చేస్తున్నాం..ఎంతమంది వస్తారో చూడాలి.

కృష్ణప్రియ చెప్పారు...

నైస్.. మాకూ ఈ మధ్య ఇలాగే ఇరవయ్యేళ్ల తర్వాత రీ-యూనియన్ అయి నేనూ దాని గురించి రాశాను.. I can relate! అలాగ తిరిగి కలవటం ఎంత అద్భుతం గా అనిపిస్తుందో..

తొలకరి చెప్పారు...

@కృష్ణప్రియ . మీరు రాసింది అప్పుడు చదివాను. నిజంగానే అద్భుతం అలా కలవడం. ఇంకా మా కబుర్లు తీరడం లేదంటే నమ్మండి.

తొలకరి చెప్పారు...

@కృష్ణప్రియ . మీరు రాసింది అప్పుడు చదివాను. నిజంగానే అద్భుతం అలా కలవడం. ఇంకా మా కబుర్లు తీరడం లేదంటే నమ్మండి.

తొలకరి చెప్పారు...

@సిరిసిరిమువ్వ. కొత్త సంవత్సరం మీకు బ్రహ్మాండంగా మొదలవుతున్నందుకు అభినందనలు.

శశిధర్ పింగళి చెప్పారు...

మీ బ్లాగుపేరు బాగుంది. రచనలు కూడాబాగున్నాయి.
మీ పుస్తక ప్రియత్వానికి అభినందనలు. మంచి పుస్తకాలే చదివారు. విశ్వనాధవారివేమీ చదవలేదా?
బెజవాడగోపాలరెడ్డిగారు విశ్వకవి గీతాంజలిని తెలుగులో వ్రాసారు ఆ పుస్తకం మీవద్ద వుంటే చెప్పండి.

తొలకరి చెప్పారు...

చాలా సంతోషం.విశ్వనాధ వారి రచనల్లో నాకు బాగా గుర్తువున్నవి ఏకవీర, చెలియలికట్ట, విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు. ఇంకా కొన్ని చదివానే కానీ నాకు జ్ఞాపక శక్తి బాగా తక్కువ అవ్వడం వాళ్ళ ప్రస్తుతం గుర్తుకు రావడం లేదు. ఇప్పటి తరం వాళ్లకి ఇలాంటి కొన్ని పుస్తకాలని బహుమతిగా ఇస్తూ వుంటాను వాళ్ళు చదివినా చదవకపోయినా. నేను ఇరవై ఏళ్ల లోపే చాలా చదివాను.కానీ ఇప్పటి వాళ్లకు అంత తీరుబడి లేదు. ఇప్పుడు నాకూ లేదు. ఇల్లు వుద్యోగం సరిపోతుంది. కాకపొతే మధ్యలో ఇలా పూర్తిగా మర్చిపోకుండా కొన్ని నెమరువేసుకుంటాను. గీతాంజలి ఎక్కడో వుండాలి, నా మతిమరుపుకు ఇది పరాకాష్ట.ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ మటుకే గుర్తుకొస్తున్నాయి....

చైతన్య దీపిక చెప్పారు...

బాగుందండి మీ చిన్న నాటి స్నేహితుల ముచ్చట.
యాంత్రిక జీవితం లో మళ్ళీ పాత స్నేహితులు అందరిని కలిసి
గడిపితే ఆ మధురమైన క్షణాలే వేరు